టాలీవుడ్ హీరోయిన్.. టాప్ డైరెక్టర్ ఏం చేశారు? ఎందుకీ రెయిడ్స్

నిజమేంటో ఆ సోదాలు చేసినవాళ్లకి..అక్కడెంత అక్రమార్జన దొరికిందీ, ఫిర్యాదు పురమాయించినవారికే తెలియాలి

టాలీవుడ్ హీరోయిన్.. టాప్ డైరెక్టర్ ఏం చేశారు? ఎందుకీ రెయిడ్స్
X

ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడైనా సోదాలు చేసారంటే.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటేనో..పన్ను ఎగవేస్తేనో జరుగుతాయి. ఐతే గత ఐదేళ్లుగా చూస్తే..వాటికి ఓ లాజిక్ అంటూ ఉండదు..వాళ్లు వ్యవహరించిన తీరుని బట్టే ఎక్కువగా ఇలాంటి రెయిడ్స్ జరుగుతున్నాయని పొలిటికల్ పార్టీలతోపాటు కామన్ మేన్‌కి కూడా అర్ధమైపోతుంది. మరి ఇప్పుడు హీరోయిన్ తాప్సీ, డైరక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సిబ్బంది తనిఖీలు చేపట్టారంటే అందులో భాగమే అనుకోవాలా..? పైగా గత ఏడాదికాలంగా వీళ్లేం భారీగా సినిమాల్లో నటించింది లేదు..నిర్మించినదీ లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ల ప్రాజెక్టులు పట్టాలెక్కి విడుదల కాబోతున్నాయ్.అంతే కాదు మధు వర్మ మంతెన అనే తెలుగు వ్యక్తికి సంబంధించిన ఆఫీస్‌లోనూ ఈ సోదాలు సాగాయ్. ఈయన తెలుగు, తమిళ్, హిందీ బంగ్లా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. హిందీ గజినీ కో ప్రొడ్యూసర్ ఇతనే. వికాస్ భల్‌కి చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్‌ పై కూడా ఈ దాడులు జరిగాయ్. ఐతే ఇక్కడే ఇదంతా వెన్‌డెట్టా( ప్రతీకార దాడులు) అనుకోవడానికి, వాటిని ఓ పార్టీకే అంటగట్టడానికి లేదు. వీళ్లలో మొదటి ఇద్దరు అనురాగ్ కశ్యప్, తాప్సీ రైతుల ఆందోళనకి మద్దతు ఇచ్చారు ఈ కోణంలోనే వీరికి వ్యతిరేకంగా సోదాలు జరిగాయని అంటున్నారు కానీ, ఇక్కడ ఇంకో కోణం వెతికితే దొరుకుతుంది.వీళ్లంతా కూడా నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలోనూ ఓ సెక్షన్ ప్రచారానికి ఎదురు తిరిగారు. కొంతమంది కావాలనే సిబిఐ ఎంక్వైరీ కోరడంతో పాటు, సుశాంత్ మాజీ గాళ్ ఫ్రెండ్‌ రియాని అరెస్ట్ చేయాలని నానా హంగామా చేసారు.ఆ సమయంలో రియా చక్రవర్తికి మద్దతుగా, మహారాష్ట్ర్ర ప్రభుత్వానికి సపోర్ట్‌గా పైన చెప్పిన లిస్ట్‌లో వాళ్లు నిలుచున్నారు. ఈ క్రమంలోనే వీళ్లపై సోదాలు జరిగాయని అనేవాళ్లే ఎక్కువ.. నిజమేంటో ఆ సోదాలు చేసినవాళ్లకి..అక్కడెంత అక్రమార్జన దొరికిందీ, ఫిర్యాదు పురమాయించినవారికే తెలియాలి మరి..!ALSO WATCH : profit your trade


Next Story

RELATED STORIES