ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్..!

తమిళ్, మలయాళ భాషల్లో సహాయనటిగా మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారిలో కే.ఆర్ సావిత్రి ఒకరు.

ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్..!
X

తమిళ్, మలయాళ భాషల్లో సహాయనటిగా మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారిలో కే.ఆర్ సావిత్రి ఒకరు. ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు కాగా తల్లి కేరళకు చెందినవారు. కేఆర్ సావిత్రితో పాటుగా ఆమె సోదరీమణులు కేఆర్ విజయ , కేఆర్ వత్సల కూడా సినిమాలలో నటించారు. ఇకపోతే కే.ఆర్ సావిత్రి కూతుర్లు అయిన అనూష, రాగసుధ కూడా నటీమణులే కావడం విశేషం.


ఇందులో నటి అనుష 13 సంవత్సరాల వయస్సులోనే తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. తెలుగులో వచ్చిన మహాయజ్ఞం సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన అనుష అనితికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ సరసన.. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, గోల్‌మాల్ గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే అనుషకి తెలుగులో కంటే తమిళ్, మలయాళం, కన్నడలో మంచి పేరు వచ్చింది. అక్కడ పలు హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. సినిమాలతో పాటుగా గృహలక్ష్మి, నిన్నేపెళ్లాడుతా, జయం వంటి తెలుగు సీరియల్ లలో కూడా నటించారు.


ఇక సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో శరవణన్ అనే వ్యక్తిని 2006లో వివాహం చేసుకున్నారు అనుష.. అటు అనుష సోదరి రాగసుధ కూడా తెలుగులో సుందర వదన సుబ్బలక్ష్మి మొగుడ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Next Story

RELATED STORIES