HBD Teja : దర్శకుడు తేజకి బర్త్ డే విషెస్..!

లైట్ బాయ్ గా ఉన్నప్పటి నుంచే తేజ తోటి మిత్రులతో చిన్న చిన్న కథలు చర్చించేవాడు. అంటే అతని లక్ష్యం దర్శకుడు కావాలనే. మధ్యలో పితా అనే ఓ హిందీ సినిమాకు కథ కూడా అందించాడు.

HBD Teja : దర్శకుడు తేజకి బర్త్ డే విషెస్..!
X

24క్రాఫ్ట్స్ లో ఏదో ఓ క్రాఫ్ట్ లో ఎక్స్ పర్ట్ అయిన వాళ్లలో చాలామంది దర్శకులవుతున్నారు. కానీ ఈ ట్రెండ్ ను రెండు దశాబ్ధాల క్రితమే మొదలుపెట్టాడు తేజ. బాలీవుడ్ లో టాప్ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుని.. రామ్ గోపాల్ వర్మతో జర్నీ చేసి.. తర్వాత తనూ దర్శకుడయ్యాడు. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. వరుస హిట్స్ తో ఓ దశలో ఇండస్ట్రీని ఊపేసిన తేజ.. తర్వాత చాలాకాలం ఆ మూసలో ఆగిపోయాడు. అయితే దేన్నైనా ఈజీగా తీసుకునే తేజ దర్శకుడుగా తెలుగు సినిమాకు ఓ కొత్త ఒరవడిని పరిచయం చేశాడు. ఇవాళ తేజ బర్త్ డే.

తేజ .. ఒకప్పుడు ఈ పేరు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని చిత్రాలు చూపించాడని. తెలుగు వారికి దర్శకుడిగానే పరిచయమైన తేజ బాలీవుడ్ లో ఒకప్పుడు తేజ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు. పిసి శ్రీరామ్, సంతోష్ శివన్ ల సరసన నిలిచేంతటి ప్రతిభావంతమైన సినిమాటోగ్రఫీ అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా తేజ కెరీర్ లో 27వరకూ అవార్డులున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ రంగంలో అతనెంత ప్రతిభావంతుడో.

లైట్ బాయ్ గా ఉన్నప్పటి నుంచే తేజ తోటి మిత్రులతో చిన్న చిన్న కథలు చర్చించేవాడు. అంటే అతని లక్ష్యం దర్శకుడు కావాలనే. మధ్యలో పితా అనే ఓ హిందీ సినిమాకు కథ కూడా అందించాడు. కొంత టైమ్ పట్టినా ఫైనల్ గా తేజ అనుకున్నది సాధించాడు. అందరూ కొత్తవారితో చిత్రం అనే సినిమా చేశాడు. కాసింత అడల్ట్ కంటెంట్ కూడా ఉండే ఈ మూవీని ఉషాకిరణ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయడ విశేషమైతే.. పెట్టుబడికి 20రెట్లు లాభాలు రావడం చిత్రాతి చిత్రం.

కొన్ని విజయాలు కాన్ఫిడెన్స్ పెంచుతాయి. అందుకే తేజ కూడా చిత్రం వంటి ఫార్ములాను పెద్దగా మార్చకుండా మరోసారి జయం చేశాడు. నితిన్, సదాలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయం కూడా అఖండ విజయం సాధించింది. దీంతో అప్పటి టాప్ హీరోలందరూ తేజతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు.

తేజ ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎవరినీ లెక్క చేయడు. స్టార్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్న కాలిక్యులేషన్స్ లో పట్టించుకోడు.. ఇవన్నీ ముందు నుంచీ వింటున్న మాటలే. అయినా.. అతనిపై నమ్మకంతో అప్పటికింకా ఇంత పెద్ద స్టార్ కాని మహేష్ బాబు సినిమా చేసేందుకు ఒప్పేసుకున్నాడు. నిజం.. ఇట్స్ ఏ లై పేరుతో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించుకున్నా కమర్షియల్ గా, మ్యూజికల్ గా ఇబ్బంది పెట్టేసింది. సినిమా మరీ 'రా' గా ఉందన్నారంతా.. మహేష్ నటనకు నంది అవార్డ్ వచ్చినా డబ్బులు రాలేదు.

తర్వాత ధైర్యం.. జయం తర్వాత నితిన్ తో సినిమా. అప్పటికే నితిన్ కు జయం తర్వాత దిల్ హిట్ అయినా .. అతను కూడా ఈ కాంబినేషన్ వచ్చే టైమ్ కు ఫ్లాపుల్లోనే ఉన్నాడు. దీంతో ఇద్దరూ కసిగా హిట్ కొడతారనుకున్నారు. కానీ ఫార్ములా మారని ధైర్యం మూవీ చూసి.. ఇక జనాలు తేజ సినిమాలు చూసే ధైర్యం కోల్పోయారు.

అయితే దర్శకుడిగా ఎన్ని ఫ్లాపులు ఉన్నా.. తేజ ఇండస్ట్రీకి చేసిన ఫేవర్ చిన్నదేం కాదు.. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ వంటి కొత్త కుర్రాళ్లను, రీమాసేన్, అనిత, సదా, కాజల్ వంటి టాలెంటెడ్ బ్యూటీస్ ను పరిచయం చేశాడు. అతని సినిమాలతో కమెడియన్ గా మారి, ఇప్పుడు స్టార్ కమెడియన్స్ గా వెలుగుతున్నవాళ్లూ ఉన్నారు.. అలాగే మ్యూజికల్ గా తేజ, ఆర్పీ పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ ల కాంబినేషన్ ఓ దశలో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Next Story

RELATED STORIES