ఆ ఒక్క సినిమా చేయలేదనే వెలితి హీరోయిన్ సౌందర్యలో ఉండేదట..!

అందం, అభినయంతో మెప్పించగల అతికొద్ది నటుల్లో సౌందర్య ఒకరు.. హీరోయిన్‌‌గా తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేశారమే..

ఆ ఒక్క సినిమా చేయలేదనే వెలితి హీరోయిన్ సౌందర్యలో ఉండేదట..!
X

అందం, అభినయంతో మెప్పించగల అతికొద్ది నటుల్లో సౌందర్య ఒకరు.. హీరోయిన్‌‌గా తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేశారమే..ఎన్నో సినిమాల్లో, ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న సౌందర్యకి ఓ సినిమా చేయలేదనే వెలితి మాత్రం ఉండేదట.. అదే యమలీల చిత్రం.. అలీ హీరోగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ యమలీల చిత్రం ఎంతటి ఘన విజుయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా సౌందర్యని అనుకున్నారట ఎస్వీ కృష్ణారెడ్డి. ఆమె కూడా కథ నచ్చడంతో సైన్ కూడా చేశారట.

ఇక షూటింగ్ మరో 15 రోజులు ఉందనగా సౌందర్య ఫోన్‌ చేసి, 'సర్‌.. పెద్ద పెద్ద హీరోల పక్కన ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ సినిమా నేను చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి' అంటూ ఎస్పీ కృష్ణారెడ్డిని రిక్వెస్ట్ చేసిందట.. నీ మనసుకు నచ్చకపోతే చేయొద్దని ఆయన అన్నారట.. అయితే ఈ సినిమాలో హీరోగా మీరు నటిస్తే, తప్పకుండా చేస్తానని సౌందర్య ఓ కండిషన్ కూడా పెట్టిందట. కానీ ఈ సినిమాకి అలీ అయితేనే కరెక్ట్ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారట. దీనితో సౌందర్య మిస్ చేసుకున్న ఆ ఛాన్స్ ఇంద్రజకి వచ్చింది. యమలీల భారీ హిట్ అవ్వడంతో ఇంద్రజ టాప్ హీరోయిన్ ప్లేస్‌‌కి వెళ్ళింది.

అయితే ఈ సినిమా తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి శుభలగ్నం అనే సినిమాని చేశారు. ఈ సినిమాలో అలీ సినిమా పిచ్చోడున్న పాత్రలో నటించాడు. ఇందులో అలీకి ఆయన ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేశారు. అయితే ఆ సాంగ్‌‌లో ఆలీతో నటించే అవకాశం తనకు ఇవ్వాలని సౌందర్య స్వయంగా కృష్ణారెడ్డిని రిక్వెస్ట్ చేశారట. అదే చినుకు చినుకు అందెలతో... అనే పాట. ఈ పాటలో ఆలీ, సౌందర్య కలిసి వర్షంలో డాన్స్ చేసి అలరించారు. ఈ పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Next Story

RELATED STORIES