Balakrishna : రియల్ హీరో బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ చికిత్సకు రూ.5.20 లక్షల సాయం

Balakrishna : రియల్ హీరో బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ చికిత్సకు రూ.5.20 లక్షల సాయం
Balakrishna : పాప చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోలేదు.

Balakrishna: సినిమాల్లో హీరో అయినా నిజ జీవితంలో ఓ మంచి మనసున్న వ్యక్తి.. సాయం కోరిన వారికి అండగా నిలుస్తారు. తల్లి పేరుతో ఏర్పాటు చేసిన బసవతారకం ఆస్పత్రిలో దేశం నలుమూలల నుంచి వచ్చిన క్యాన్సర్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరికి చెందిన ఏడేళ్ల మణిశ్రీ అనే చిన్నారి గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. పాప చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోలేదు.

దీంతో వారు బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిని కలిశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని నటుడి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాలయ్య చికిత్సకు అవసరమయ్యే మొత్తం ఖర్చును మాఫీ చేయమని డాక్టర్‌ని ఆదేశించారు. విషయం తెలుసుకున్న బాలకృష్ణ అభిమానులు మా బాలయ్య మనసున్న మంచి వ్యక్తి అంటూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story