వెండితెర సోగ్గాడు శోభన్‌ బాబు నటించనని వదులుకున్న పాత్రలివే..!

వెండితెర సోగ్గాడు శోభన్‌ బాబు నటించనని వదులుకున్న పాత్రలివే..!
ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దివంగత నటుడు శోభన్ బాబు.

ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దివంగత నటుడు శోభన్ బాబు.. ఆయనని అందగాడు, సోగ్గాడని ముద్దుగా పిలుచుకునేవారు అభిమానులు. హీరోగా తనని గుండెల్లో పెట్టుకున్న అభిమానులు.. నా కెరీర్‌ కూడా హీరోగానే ముగిసిపోవాలి తప్ప మరో విధంగా కాదని సినిమాల్లో సహాయ పాత్రలు చేసేందుకు ఆయనఆసక్తి చూపించలేదు. అందులో భాగంగా చాలా మంచి మంచి పాత్రలను ఆయన కోల్పోయారు.

అన్నమయ్య :

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'అన్నమయ్య' చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని శోభన్ బాబును చిత్రబృందం కోరగా.. ఆ కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించారట...దీనితో ఆ పాత్రకి సుమన్‌కి దక్కింది

అతడు :

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ అతడు.. ఈసినిమాలో సత్యనారాయణ మూర్తి (నాజర్‌) పాత్రను శోభన్‌ బాబుతో చేయించాలని నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ అనుకున్నారట.. అందుకుగాను ఆయన ఇంటికి బ్లాంక్‌ చెక్కు కూడా పంపించారట.. కానీ అందుకు శోభన్‌ బాబు నో చెప్పారట. దీనితో ఆ పాత్ర నాజర్ కి దక్కింది.

సుస్వాగతం :

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్‌ పోషించిన పాత్ర ముందుగా శోభన్‌ బాబు దగ్గరికి వెళ్లిందట.. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రను రఘువరన్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story