తరుణ్ రీఎంట్రీ.. త్వరలోనే కొత్త సినిమా?

ఒకప్పుడు యూత్ లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో తరుణ్.. వరుస ప్లాపులతో సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

తరుణ్ రీఎంట్రీ.. త్వరలోనే కొత్త సినిమా?
X

ఒకప్పుడు యూత్ లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో తరుణ్.. వరుస ప్లాపులతో సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ మంచి కథతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడట తరుణ్... తన ఫ్రెండ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాని చేయబోతున్నాడట.. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. కాగా 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టొరీ సినిమా తరవాత మళ్ళీ హీరోగా తరుణ్ .. సినిమాలు చేయలేదు. కాగా గత 14 ఏళ్లలో తరుణ్ నుంచి కేవలం ఆరు సినిమాలే వచ్చాయి. ఇందులో చాలా వరకు ప్లాప్ సినిమాలే ఉన్నాయి.

Next Story

RELATED STORIES