వేణు తొట్టెంపూడి కంబ్యాక్‌.. మాస్‌ మహారాజ చిత్రంతో

అయితే ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'వెల్కమ్ ఎ బోర్డ్ వేణు' అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

వేణు తొట్టెంపూడి కంబ్యాక్‌.. మాస్‌ మహారాజ చిత్రంతో
X

స్వయవరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హీరో వేణు తొట్టెంపూడి .. మొదటి సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న వేణు.. ఆ తర్వాత స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, కళ్యాణ రాముడు మొదలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే గోపి గోపిక గోదావరి సినిమా తరవాత సినిమాలకు దూరమైన వేణు.. 2012లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో ఓ కీ రోల్ పోషించాడు. ఈ పాత్ర వేణుకి అంతగా పేరు తీసుకురకపోవడంతో మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు వేణు.. ఇదిలా ఉండగా తాజాగా హీరో వేణుకి బంపర్ ఆఫర్ వచ్చింది.

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'వెల్కమ్ ఎ బోర్డ్ వేణు' అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో వేణు పాత్ర ఏంటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వేణు ఎంట్రీ ఇస్తుండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ సినిమా వేణుకి ఎలాంటి సక్సెస్‌‌ని ఇస్తుందో చూడాలి.

Next Story

RELATED STORIES