కళ్ళు చిదంబరంతో నటించనని ఖరాఖండిగా చెప్పేసిన శ్రీదేవి...!

కళ్ళు చిదంబరంతో నటించనని ఖరాఖండిగా చెప్పేసిన శ్రీదేవి...!
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులున్నారు. అందులో ఒక్కోకరిది ఒక్కో స్టైల్... తమ హావభావాలతో ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులున్నారు. అందులో ఒక్కోకరిది ఒక్కో స్టైల్... తమ హావభావాలతో ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతారు. అందులో కళ్ళు చిదంబరం ఒకరు. 'కళ్ళు' అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారాయన.. ఇదే ఆయనకి ఇంటి పేరు అయిపొయింది. గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, డి.విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో నటనకి గాను కళ్ళు చిదంబరంకి నంది అవార్డు కూడా లభించింది. కళ్ళు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం.

ఆయన అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే, నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకల నుంచి సినిమాల్లోకి వచ్చారు. తానూ ఉద్యోగం చేస్తున్న డబ్బును ఇంటి ఖర్చులకి వాడేవారు. ఇక సినిమాల ద్వారా వచ్చిన డబ్బును నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో కళ్ళు చిదంబరం ఎక్కువగా కనిపించేవారు. అలా దాదాపుగా 300లకు పైగా సినిమాల్లో నటించారు. కళ్ళు చిదంబరం విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్య సమస్యలతో 2015లో తుదిశ్వాస విడిచారు.

ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్ లో గోవిందా గోవిందా అనే సినిమా తెరకెక్కింది. 1994లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కళ్ళు చిదంబరంతో నటించాల్సి ఉంటుందని హీరోయిన్ శ్రీదేవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందే చెప్పాడట.. అయితే తాను కళ్ళు చిదంబరంతో నటించనని శ్రీదేవి ఖరాఖండిగా చెప్పేసిందట.

అప్పుడు రామ్ గోపాల్ వర్మ.. " కళ్ళు చిదంబరం.. మామూలు వ్యక్తి కాదు ఓ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనతో నటించడం తప్పేంటి" అని చెప్పడంతో శ్రీదేవి రియలైజ్ అయ్యారట. అనంతరం శ్రీదేవితో ఆ సినిమాలో కళ్ళు చిదంబరం కనిపిస్తారు.



Tags

Read MoreRead Less
Next Story