High court : గణేష్‌ నిమజ్జనంపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.!

High court : గణేష్‌ నిమజ్జనంపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.!
గణేష్‌ నిమజ్జనంపై GHMC వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

గణేష్‌ నిమజ్జనంపై GHMC వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. గత ఏడాదిలోనూ నిమజ్జనంపై ఉత్తర్వులు ఇచ్చినా.. ఇప్పటికీ వాటిని పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాల్సిందేనని ఆదేశించింది. ఒకవేళ ఈ నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో అప్పీల్‌కి వెళ్లొచ్చని సూచించింది.

నిమజ్జనం సందర్భంగా సరైన నిబంధనలు పాటించకపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నందునే కారణంగానే తాము ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. P.O.P విగ్రహాల తయారీ వద్దని ప్రభుత్వం ముందే ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని, వీటిని పరిష్కరించాల్సింది అధికారులేనని వ్యాఖ్యానించింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదనే విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదని కూడా ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.

POP విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడమా, మళ్లీ ఛాలెంజ్ చేయడమా అనే దానిపై ఉన్నత స్థాయిలో సమీక్ష తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story