హైపర్ ఆది అసలు పేరు.. ఊళ్లో ఉన్న 3 ఎకరాల పొలం అమ్మి..

ఎగతాళి చేసిన వారిపై పంతంతో విజయం సాధించానని చెబుతాడు.

హైపర్ ఆది అసలు పేరు.. ఊళ్లో ఉన్న 3 ఎకరాల పొలం అమ్మి..
X

జబర్ధస్త్ షోలో ఆది పంచ్‌లకు డిమాండ్ ఎక్కువ.. టైమింగ్‌తో కూడిన అతడి పంచ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంజనీరింగ్ చదివి సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆది కామెడీ స్క్టిట్లు చేస్తూ నలుగురినీ నవ్విస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు.. తన పేరు గురించి చెప్పడంతో పాటు మరి కొన్ని విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఆది.. హైపర్ ఆది తాత పేరు కోట ఆదయ్య .. అదే పేరు ఆదికి పెట్టారు. స్కూల్లో, కాలేజీలలో ఆ పేరుతో అతడిని బాగా ఆటపట్టించేవారట.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆదిగా పేరు మారింది. హైపర్ అనే టైటిల్‌ని జబర్దస్త్ చేసేటప్పుడు దర్శకులు పెట్టారు. ఆది చేసే స్కిట్లలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండేది. దాంతో హైపర్ అని పేరు పెట్టారు. అమ్మా, నాన్న ఇద్దరు తమ్ముళ్లు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఉన్న మూడెకరాల పొలం అమ్మి పిల్లల పై చదువులకు ఖర్చు చేశాడు తండ్రి. ఒక్కోసారి రూ.100 ల కోసం కూడా పక్కింటి వాళ్లని అప్పు అడిగిన సందర్భాలు ఉన్నాయంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు ఆది. ఆ సమయంలోనే చేస్తున్న ఉద్యోగం వదిలేసి జబర్ధస్త్‌ షోలో అవకాశం కోసం ప్రయత్నించాడు.

మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంటే అందరూ ఆట పట్టించేవారు.. అయినా అదే కంటిన్యూ చేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు. అభి అన్న వల్లే తానీ స్థాయిలో ఉన్నానని చెబుతాడు. 12 స్కిట్ల తరువాత టీమ్ లీడర్ అయ్యానని తెలిపాడు. ఎగతాళి చేసిన వారిపై పంతంతో విజయం సాధించానని చెబుతాడు. ఏ ఊర్లో అయితే మూడెకరాల పొలం అవసంరం కొద్దీ అమ్ముకున్నాడో అదే ఊర్లో 10 ఎకరాల పొలం కొనుక్కున్న ఆది తోటి కమెడియన్లకు స్ఫూర్తి.

Next Story

RELATED STORIES