మూగ, చెవిటి.. మరి ఎలా నటిస్తుంది.. ఏకంగా ఆ సినిమాకి 13 అవార్డులు..!

అభినయ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఓ నటికి ఉండాల్సిన అన్ని లక్షణాలున్నాయి. అటు అందం, ఇటు అభినయంతో చేసే పాత్రకి పరిపూర్ణతను తీసుకువస్తుంది.

మూగ, చెవిటి.. మరి ఎలా నటిస్తుంది.. ఏకంగా ఆ సినిమాకి 13 అవార్డులు..!
X

అభినయ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఓ నటికి ఉండాల్సిన అన్ని లక్షణాలున్నాయి. అటు అందం, ఇటు అభినయంతో చేసే పాత్రకి పరిపూర్ణతను తీసుకువస్తుంది. తెలుగు, తమిళ భాషలలోచాలా సినిమాల్లో నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. పుట్టుకతోనే చెవిటి మరియు మూగ అయిన అభినయను ఎలాగైనా మాట్లాడించాలని ఆమె తల్లిదండ్రులు చాలానే ప్రయత్నాలు చేశారు. చాలానే ఖర్చు కూడా చేశారు. కానీ కుదరలేదు. అభినయకి చిన్నప్పటి నుంచి నటన అంటే చాల ఇష్టం. కానీ ఆమె వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం వల్ల అవకాశాలు రాలేదు. ఆమె ఇష్టాన్ని గ్రహించిన ఆమె తండ్రి యాడ్స్‌‌లో నటింపచేయాలని ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే అక్కడ మాట్లాడకపోయిన సరిపోతుంది కాబట్టి. అలా చాలానే యాడ్స్ లలో నటించింది.

ఇక అభినయ తండ్రికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం కావడంతో ఆయన వెళ్లిన ప్రతిచోట తనతో పాటు తన కూతురు ఫోటోలు కూడా వారికి ఇచ్చేవారు. అయితే అందంగా ఉంది కానీ మాటలు రావు, వినబడదు అనేసరికి అవకాశాలు ఇచ్చేందుకు ఎవరు కూడా సుముఖత చూపించలేదు. అయితే నాదోదిగ‌ల్ అనే సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చింది. అదెలా అంటే.. ముందుగా ఈ సినిమాకి ఓ ముంబై నటిని అనుకున్నారు. ఆమెకి తమిళ్ చాలా కష్టం అవ్వడంతో ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. దీనితో సీరియస్ అయిన దర్శకుడు సముద్రఖని.. అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ను తీసుకొచ్చి ఆ పాత్రలో నటింపజేయాలని అనుకున్నారు.


అలా అభినయను ఆ ఛాన్స్ రావడంతో ఆ సినిమాలో అత్యద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో ఆమె పాత్రకి గాను ఏకంగా 13 అవార్డులు వచ్చాయి. ఇదే సినిమాను తెలుగులో శంభో శివ శంభో గా తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా హీరో రవితేజ చెల్లెలిగా నటించింది అభినయనే కావడం విశేషం. ఆ సినిమా తర్వాత తెలుగులో దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పలు సినిమాలలో నటించింది అభినయ..

అయితే అభినయ పుట్టకతో మూగ, చెవిటి కావడంతో ఆమె ఎలా నటిస్తుందనే అనుమానం రావడం సహజం.. ఆమెకి సంబంధించిన పాత్రను, ఆమె చెప్పాల్సిన డైలాగ్స్ ని ముందుగా దర్శకులు ఆమె తల్లిదండ్రులకి వివరిస్తారు. ఆ తర్వాత వారు ఆమెకి సైగల ద్వారా చెబుతారు. దీనిని ఆమె అర్ధం చేసుకొని సింగిల్ టెక్ లోనే ఆ సన్నివేశాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.

Next Story

RELATED STORIES