ఈ రాజశేఖర్ హీరోయిన్ గుర్తుందా.. భానుప్రియతో ఉన్న రిలేషన్ ఏంటి?

ప్రతి ఒక్కరు సినిమా పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే రాణించడం కూడా కష్టమే..

ఈ రాజశేఖర్ హీరోయిన్ గుర్తుందా.. భానుప్రియతో ఉన్న రిలేషన్  ఏంటి?
X

ప్రతి ఒక్కరు సినిమా పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే రాణించడం కూడా కష్టమే.. అలా త్వరగానే ఫెడ్ అవుట్ అయిపోయినవారు చాలా మంది ఉన్నారు. ఆ కోవాలోకే వస్తుంది ఈ రాజశేఖర్ హీరోయిన్ వింధ్య.. రాజశేఖర్ హీరోగా సముద్ర దర్శకత్వంలో వచ్చిన సింహరాశి సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌‌లో నటించింది. ఈ సినిమా తర్వాత హరికృష్ణ హీరోగా వచ్చిన సీతయ్య సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమాలేమి ఆమెకి పేరును తీసుకురాలేకపోయాయి. కానీ తమిళ్‌‌లో బాగానే సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా ఆమె కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. దీనితో హీరోయిన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా కూడా ఫెడ్ అవుట్ అయిపొయింది.


తెలుగు తమిళ్‌‌లో కలిపి ఆమె 20 సినిమాల్లో నటించారు. సినిమాలలో ఫెడ్ అవుట్ అయిపోవడంతో సినీ నటి భానుప్రియ సోదరుడైన గోపాలకృష్ణన్ ను 16 ఫిబ్రవరి 2008లో ప్రేమించి పెళ్లి చేసుకుంది వింధ్య.. నాలుగేళ్ళ వివాహ బంధం తరవాత ఇద్దరు విడిపోయారు. ఇక సినిమాలలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో జయలలిత సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. 2011 , 2016 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 లోక్‌సభ ఎన్నికలలో వింధ్య డిఎంకె పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. జయలలిత మరణం తరువాత వింధ్య కొన్ని రోజులు క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆమె పార్టీ కోసం ప్రచారం చేసింది.Next Story

RELATED STORIES