ఈ ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

పౌరాణిక సినిమాలకి పెట్టింది పేరు నందమూరి వంశం.. ఎన్నో పౌరాణిక చిత్రాలతో ఎన్నో పాత్రాలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నందమూరి తారకరామారావు..

ఈ ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!
X

పౌరాణిక సినిమాలకి పెట్టింది పేరు నందమూరి వంశం.. ఎన్నో పౌరాణిక చిత్రాలతో ఎన్నో పాత్రాలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నందమూరి తారకరామారావు.. ఆ తర్వాత ఆయన నటవారసుడిగా బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇటు మాస్ కథలను చేస్తూనే మరోవైపు పౌరాణిక చిత్రాలతో మెప్పించారు. ఆ తర్వాత చాలా మంది హీరోలుగా వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాగా క్లిక్ అయ్యారు. ఎన్టీఆర్ చైల్డ్ అరిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరత అనే పాత్రను పోషించాడు.

ఇక 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో రాముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో సీత పాత్రలో స్మితా మాధవ్ నటించింది.. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. అయితే బాలరామాయణం తర్వాత స్మితా మాధవ్ మళ్ళీ కన్పించలేదు. ఆమె నటన వైపు కాకుండా డాన్స్ వైపు అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొంది అనేక స్టేజ్ షోస్ ఇచ్చింది. దేశవిదేశాల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ తో అలరిస్తుంది. ఇక బుల్లితెరపై స్మిత పలు భాషలలో అనేక కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. జెమిని టీవీలో వచ్చిన జయంమనదే యొక్క షోలో అనేక ఎపిసోడ్‌లను హోస్ట్ గా చేసింది

Next Story

RELATED STORIES