Aa Naluguru : చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా..!

Aa Naluguru : చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా..!

Aa Naluguru (File Photo)

Aa Naluguru Movie : చాలా సినిమాలు ఆనందాన్ని ఇస్తే కొన్ని సినిమాలు మాత్రమే ఆలోచింపజేసేలా చేస్తాయి. అలా ఆలోచింపజేసే సినిమాలలో రాజేంద్రప్రసాద్ "ఆ నలుగురు" సినిమా ఒకటి..

Aa Naluguru Movie : చాలా సినిమాలు ఆనందాన్ని ఇస్తే కొన్ని సినిమాలు మాత్రమే ఆలోచింపజేసేలా చేస్తాయి. అలా ఆలోచింపజేసే సినిమాలలో రాజేంద్రప్రసాద్ "ఆ నలుగురు" సినిమా ఒకటి.. డబ్బు కంటే సమాజం పైన ఉన్న ప్రేమ, మానవత్వం, విలువలే ముఖ్యమని, అవే మనిషిని చనిపోయాక కూడా బ్రతికిస్తాయని చెప్పిన అద్భుతమైన చిత్రం ఇది.. ప్రతి మనిషి తన జీవితంలో చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది.. ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. !

చిత్తూరు జిల్లాకు చెందిన రైటర్ మదన్ కి చదువుకునే రోజుల్లో మదనపల్లెలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆయనని బాగా కదిలించింది. ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన అంతిమయాత్రకు ఊరికి ఊరే కదలివచ్చింది. దానికి కారణం ఆయన జీవించినన్నాళ్ళూ పక్కవాళ్ళ మంచినే కోరుకున్నాడు కాబట్టి.. ఇది రైటర్ మదన్ ని బాగా కదిలించింది. దీనిని ఓ సీరియల్ స్క్రిప్ట్ గా డెవలప్ చేసుకున్నాడు.. ఈ స్క్రిప్ట్ కి ముందుగా అంతిమయాత్ర అనే టైటిల్ పెట్టారు మదన్.

ఓ ప్రముఖ ఛానల్ లో సీరియల్ కోసం ఈ స్క్రిప్ట్ ని వినిపిస్తే "అంతిమయాత్ర" అనే టైటిల్ చూసి రిజెక్ట్ చేశారట.. ఆ తర్వాత ఇదే కథ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గరకి వెళ్ళింది.. ఆయన దానిని సినిమా స్క్రిప్ట్ కి చేంజ్ చేయమని చెప్పారు. కధంతా పూర్తి అయ్యాక నిర్మాత భాగ్యరాజాని పిలిపించి కథ చెప్పారట. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేస్తానని, అయితే తానే ప్రధానపాత్రలో నటిస్తానని ప్రతిపాదించారట..ఆ తరవాత వివిధ కారణాల వల్ల మళ్ళీ ఈ కథ మూలన పడిపోయింది. చివరికి ఈ కథ .. దర్శకుడు చంద్రసిద్దార్థ్ దగ్గరికి వెళ్ళింది. కథ బాగుండడంతో ఆయన చేసేందుకు రెడీ అయిపోయారు. అయితే అప్పటివరకు అంతిమయాత్రగా ఉన్న సినిమా టైటిల్ ని.. ఆ నలుగురుగా మార్చారు.

స్క్రిప్ట్ లో రచయిత డి.వి.నరసరాజు కూడా సహాయం చేశారు. తాకట్టు లేకుండా ఏదీ అప్పుగా ఇవ్వని కోట పాత్ర హీరోకి తాకట్టు లేకుండానే అప్పు ఇస్తాడు. అదెలా సాధ్యపడుతుందన్న సందేహం తీరకపోవడంతో, డి.వి.నరసరాజు.. "మోసం చేయడం కూడా చేతకాని పిచ్చివాడివి.. అందుకే తాకట్టు లేకుండా అప్పు ఇస్తున్నాను" అన్న డైలాగ్ రాశారు.

* ముందుగా ఈ సినిమాలో రఘురామయ్య పాత్రకి దర్శక నటులు విసు, దాసరి నారాయణరావు, నటుడు మోహన్‌ బాబు, ప్రకాష్ రాజ్, కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులను అనుకున్నారట.. కానీ చివరికి ఈ పాత్ర.. రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్ళింది. కథ విన్నాక ఆయన కళ్ళుతుడుచుకుని ఈ సినిమాని చేసేందుకు ఒప్పుకున్నారు.. రఘురామయ్య పాత్రకి సంబంధించిన వేషధారణ, ప్రవర్తించే తీరు, సంభాషణలు చెప్పే విధానం, కళ్ళజోడు, పంచెకట్టు, విగ్గు ఇలా అన్నీ ఎలావుండాలో ఆయనే ప్లాన్ చేసుకున్నారట.

* ఇక రాజేంద్రప్రసాద్ భార్య పాత్రకి లక్ష్మి, గౌతమి, భానుప్రియ, రోజా మొదలైన నిన్నటితరం హీరోయిన్ లను అనుకున్నారట.. కానీ చివరికి రాజేంద్రప్రసాద్.. తనతో కలిసి మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనిని గుర్తుచేసుకుని, ఆమెను సంప్రదించమని సలహా ఇచ్చారట.. అలా ఆమె కూడా ఈ కథ విని వెంటనే ఓకే చెప్పారట..

* సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. 38 రోజుల్లో షూటింగ్ పూర్తి కాగా, కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్లో సినిమా పూర్తైంది.

* మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్న ఆర్పీ పట్నాయక్ .. ఈ సినిమా కథ నచ్చి అద్భుతమైన సంగీతం అందించారు.

* ఈ సినిమాలోని హీరో అంతిమయాత్రకి సంబంధించిన సన్నివేశాలు ఎడిటింగ్ చేస్తుండగా దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తండ్రి మరణించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సినిమా ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకొని డిసెంబర్ 9, 2004న సినిమా విడుదలైంది.

* సినిమా విడుదలైన రోజున దాదాపుగా థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. ఆ తర్వాత మౌత్ టాక్ తో సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాతి రోజులలో అన్ని షోలూ హౌస్ ఫుల్ గా నడిచాయి... అలా "ఆ నలుగురు" ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

* ఈ సినిమాని కన్నడ, మరాఠీ భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

* 2004లో ఉత్తమ చిత్రంగా ఆ నలుగురు సినిమాకి నంది అవార్డు లభించింది. రఘురామయ్య పాత్రకి గాను రాజేంద్ర ప్రసాద్ కి ఉత్తమ నటుడుగా నంది అవార్డు, కోటయ్య పాత్రకి గాను కోట శ్రీనివాసరావుకు ఉత్తమ క్యారెక్టర్ గా నంది అవార్డు లభించింది.

Tags

Read MoreRead Less
Next Story