ఆ జీపు పంపిస్తేనే షూటింగ్ కి వస్తా... దర్శకుడికి బాలయ్య కండిషన్!

సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ముఖ్యంగా సినిమాలో అయన పాత్రకైతే ప్రాణం పెట్టేస్తారు.

ఆ జీపు పంపిస్తేనే షూటింగ్ కి వస్తా... దర్శకుడికి బాలయ్య కండిషన్!
X

సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ముఖ్యంగా సినిమాలో అయన పాత్రకైతే ప్రాణం పెట్టేస్తారు. బాలకృష్ణ పోలిస్ గెటప్ లో వచ్చిన చిత్రాలలో 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' సినిమా ఒకటి. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పుడు ట్రెండ్ సెట్టర్‌ గా నిలిచింది.

ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ అభిమానుల చేత చప్పట్లు కొట్టించింది. అయితే ఆ పాత్ర తెరపైన అంత బాగా రావడానికి బాలకృష్ణ చేసిన హోం వర్క్ చాలానే ఉందట. పోలీసులు ఎలా నడుస్తారు. ఎలా లాఠీ పట్టుకుంటారు. జీపులో ఎలా కూర్చుంటారు లాంటి వాటిపైన బాలకృష్ణ ఫోకస్ చేశారట..

అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు బి. గోపాల్ కి ఓ ఓ కండిషన్‌ కూడా పెట్టారట బాలకృష్ణ. ఆ కండిషన్ ఏంటో తెలిస్తే బాలకృష్ణకి సినిమా అంటే, నటన అంటే ఎంత ప్యాషన్‌ ఉందొ తెలుస్తుంది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే.. సినిమా షూటింగ్ అయిపోయేవరకు తానూ ఇంటి నుంచి షూటింగ్ కి సినిమాలో తానూ వాడుతున్న జీపు పంపిస్తేనే వస్తానని అన్నారట.

అప్పుడే తానూ ఆ పాత్రలో లీనమవ్వగలనని దర్శకుడు బి. గోపాల్ తో చెప్పారట.. ఈ విషయాన్నిబి. గోపాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా షూటింగ్ అయిపోయేవరకు బాలయ్య తన ఇంటి నుంచి అలానే వచ్చారని అయన తెలిపారు.

Next Story

RELATED STORIES