ఊరమాస్‌ లుక్‌లో పుష్ప రాజ్..

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజును సందర్భంగా ఒకరోజు ముందే మెగా అభిమానులకి గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్..

ఊరమాస్‌ లుక్‌లో పుష్ప రాజ్..
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప .. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజును సందర్భంగా ఒకరోజు ముందే మెగా అభిమానులకి గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్..సినిమాకి సంబంధించిన టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. టీజర్ ప్రేక్షకులకి వీపరిటంగా నచ్చేసింది.

కాంబినేషన్ తోనే సినిమా పైన అంచనాలు పెరగగా.. తాజా టీజర్ తో సినిమా పైన ఆ అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక ఆడిపాడనుంది. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా నటిస్తున్నాడు. మైత్రిమూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story

RELATED STORIES