మహాభారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది.. ఆసక్తికరంగా 'తలైవి' ట్రైలర్..!

నటీగా, రాజకీయ నాయకురాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపును సంపాదించుకుంది జయలలిత.. ఆమె జీవితకథ ఆధారంగా "తలైవి" అనే చిత్రం తెరకెక్కుతుంది.

మహాభారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది.. ఆసక్తికరంగా తలైవి ట్రైలర్..!
X

నటీగా, రాజకీయ నాయకురాలుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపును సంపాదించుకుంది జయలలిత.. ఆమె జీవితకథ ఆధారంగా "తలైవి" అనే చిత్రం తెరకెక్కుతుంది. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల పాటు ఉన్న చిత్ర ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకుంది. జయలలిత పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి.

'మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..జయ' అంటూ కంగనా చెప్పిన డైలాగ్ సినిమా స్థాయిని పెంచేసింది. ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

విబ్రి పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story

RELATED STORIES