మేడం సార్.. మేడం అంతే... గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!

పైన ఫోటోలో కనిపిస్తున్న సీనియర్ నటి ఎవరో గుర్తుపట్టండి.. కాస్త టైం తీసుకున్న కష్టమే అని చెప్పాలి. అవును మరి.. అంతలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

మేడం సార్.. మేడం అంతే... గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
X

పైన ఫోటోలో కనిపిస్తున్న సీనియర్ నటి ఎవరో గుర్తుపట్టండి.. కాస్త టైం తీసుకున్న కష్టమే అని చెప్పాలి. అవును మరి.. అంతలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన కొత్త అవతారంతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ మాత్ర్రమే కాదు పెద్ద షాక్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఈమె ఎవరో కాదు.. సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్.. అయిదు పదుల వయసులోనూ స్టన్నింగ్‌ బ్యూటీలా తయారైంది.

ఒకప్పుడు లావుగా ఉన్న ఈమె.. ఫిట్‌గా ఉండేందుకు ఇటీవల భారీ కసరత్తులు చేసింది. దాదాపుగా 10 నెలల్లో దాదాపు 12 కిలోల బరువు తగ్గి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారాయి. స్టన్నింగ్‌ బ్యూటీలా తయారైన ఖుష్బూకి ఓ నెటిజన్‌ కొంటె ప్రశ్న వేయగా ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై కూడా వైరల్‌‌‌‌‌‌గా మారింది.


మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ నెటిజన్ ప్రపోజ్‌ చేయగా అందుకు ఆమె బదులిచ్చారు. సారీ నువ్ బాగా లేట్.. 21 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అయినా సరే ఒకసారి నా భర్తని అడిగి చెబుతా అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. ఇక్కడితో ఈ కన్వర్జేషన్ ఆగిపోలేదు. మీ భర్త నుంచి సమాధానం వచ్చిందా మేడం అంటూ ఆ నెటిజన్ ఆరా తీయగా, ఆయనకు నేను మాత్రమే భార్యని.. కాబట్టి సారీ అని చెప్పామన్నారు. నన్ను వదులుకునేందుకు రెడీగా లేరట అంటూ సమాధానం ఇచ్చింది.

కాగా ప్రస్తుతం తమిళ్‌‌లో రజినీకాంత్‌‌తో ఓ సినిమాని చేస్తున్న ఖుష్బూ.. తెలుగులో శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తోంది. అటు రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బీజేపీలో చేరారు.


Next Story

RELATED STORIES