టెన్నిస్ స్టార్‌‌తో కృష్ణవంశీ హీరోయిన్‌ డేటింగ్.. !

41ఏళ్ల ఈ అమ్ముడు ఇప్పుడు ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

టెన్నిస్ స్టార్‌‌తో కృష్ణవంశీ హీరోయిన్‌ డేటింగ్.. !
X

"ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ కుర్రకారు గుండెల్లో" గుబులు రేపిన కిమ్‌శర్మ గుర్తుండే ఉంటుంది కదా.. ఇలా అనడం కన్నా ఖడ్గం సినిమా హీరోయిన్ అంటే టక్కున గుర్తుకువస్తుంది కావచ్చు. అవును ఈ సినిమాలో పూజ అనే పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.. 41ఏళ్ల ఈ అమ్ముడు ఇప్పుడు ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గోవాలో వీరిద్దరూ ఎంచక్కా చక్కర్లు కొట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా నడుస్తుంది. దీనికి తోడు కిమ్‌శర్మ తాను సోలోగా ఉన్న ఫొటోలను పోస్టు చేస్తూ 'మిస్టర్‌.పి' అంటూ పేస్‌ పేరును చెప్పకనే చెప్పేసింది. దీనితో ఆ వార్తలకి మరింతగా బలం చేకూరింది. గతంలో కిమ్‌శర్మ ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కొన్ని రోజులు డేటింగ్‌ చేసింది. ఆ తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు.

అనంతరం 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను కిమ్‌శర్మ వివాహం చేసుకుంది. ఆరేళ్ళ వైవాహిక జీవితం తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది. కొంతకాలం పాటు సినీ నటుడు హర్షవర్దన్‌రానేతోనే ప్రేమాయణం సాగించిన కిమ్‌శర్మ .. ప్రస్తుతం టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు లియాండర్‌ పేస్‌ సైతం మోడల్‌ రియా పిళ్లైతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.




Next Story

RELATED STORIES