Krithi Shetty Addsక్యూట్ బేబీ కృతి శెట్టి.. చిన్నప్పుడే చాక్లెట్ యాడ్‌లో మెరిసి..

Krithi Shetty Addsక్యూట్ బేబీ కృతి శెట్టి.. చిన్నప్పుడే చాక్లెట్ యాడ్‌లో మెరిసి..

Krithi Shetty Adds

Krithi Shetty Adds: సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దేవీ శ్రీ మ్యూజిక్.. మొత్తానికి ఉప్పెన తెలుగు ప్రేక్షకులు గుండెల్లో అలల కెరటాలై పరుగులు పెట్టింది.

Krithi Shetty Adds: సొట్టబుగ్గల కృతి శెట్టి.. చిన్నప్పుడు కూడా బిజీ స్టారే.. కెమెరా నాకేం కొత్త కాదు అంటూ ఉప్పెనతో ఉవ్వెత్తున ఎగసిపడింది.. స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని అప్పుడే సొంతం చేసుకుంది.. దాంతో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటోంది.. అన్నీ కలిసి రావడం అంటే ఇదే.. బొంబాయి బ్యూటీ కృతి శెట్టి తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే మెగాస్టార్ ఫ్యామిలీ వ్యక్తితో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దేవీ శ్రీ మ్యూజిక్.. మొత్తానికి ఉప్పెన తెలుగు ప్రేక్షకులు గుండెల్లో అలల కెరటాలై పరుగులు పెట్టింది. కృతి తన నటనకుగాను మంచి మార్కులు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే చక్కటి అభినయాన్ని ప్రదర్శించిదనుకుంటే పొరపాటే.. చిన్నప్పుడే కెమెరాతో ఓ ఆట ఆడేసుకుంది.

పలు యాడ్లలో నటించింది. వస్త్రాలకు సంబంధించిన ఓ యాడ్‌తో పాటు, లైఫ్‌బాయ్, డైరీమిల్క్ చాక్లెట్ వంటి పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. టీనేజ్‌లోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ 30 సినిమాలోను కృతి ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story