ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు డార్క్ కామెడీ 'క్షణ క్షణం'..!

ఉదయ్ శంకర్, జియా శర్మ హీరోహీరోయిన్లుగా.. మన మూవీస్ బ్యానర్ లో, కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం క్షణ క్షణం. తాజాగా ఈ సినిమా సెన్సార్ పని పూర్తి చేసుకుంది.

ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు డార్క్ కామెడీ క్షణ క్షణం..!
X

ఉదయ్ శంకర్, జియా శర్మ హీరోహీరోయిన్లుగా.. మన మూవీస్ బ్యానర్ లో, కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం క్షణ క్షణం. తాజాగా ఈ సినిమా సెన్సార్ పని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ లభించింది. డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. మా సినిమా మాకు మంచి సక్సెస్ ని అందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. డార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా ఫీల్ అవుతారని అన్నారు. దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ.. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా రియలిస్టిక్ గా సినిమాను మలిచామని, ప్రతి పాత్ర చాలా సహాజంగా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో రవి ప్రకాశ్, గిఫ్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రఘు కుంచె, కోటి సంగీతం అందించారు.

టెక్నీషియన్స్ : డిఓపి: కె. సిద్దార్ద్ రెడ్డి, మ్యూజిక్ : రోషన్ సాలూర్ , ఎడిటర్: గోవింద్ దిట్టకవి, పి.ఆర్. ఓ : జియస్ కె మీడియా, నిర్మాతలు : డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి దర్శకుడు : మేడికోండ కార్తిక్

Next Story

RELATED STORIES