నాకు ఎలాంటి గాయాలు కాలేదు.. ఎవరూ ఆందోళన చెందవద్దు : ఖుష్బూ

నాకు ఎలాంటి గాయాలు కాలేదు.. ఎవరూ ఆందోళన చెందవద్దు : ఖుష్బూ
X

సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢికొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుష్బూ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఖుష్బూ కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్‌ వద్ద ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీ కొట్టింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారుడోర్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కడలూరులో బీజేపీ నిర్వహిస్తున్న వేల్ యాత్రలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం జరిగిన తర్వాత నటి ఖుష్బూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. మరో వాహనంలో కడలూరికి పయనమయ్యారు. దేవుడి దయ వల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES