ఎంతిచ్చినా నేను చేయను: లావణ్య త్రిపాఠి

నేను చేయను గాక చేయను అంటోంది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.

ఎంతిచ్చినా నేను చేయను: లావణ్య త్రిపాఠి
X

భారీ పారితోషికం.. నాకేం వద్దు.. నేను చేయను గాక చేయను అంటోంది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.. ఇంతకీ అది ఏ సినిమానో కాదు.. ఓ వాణిజ్య ప్రకటన.. జీతం కంటే గీతం బాగా వస్తున్నట్టు.. సినిమాల కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్న నటీనటులున్న ఈ రోజుల్లో లావణ్య త్రిపాఠి ఓ యాడ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమంటే వద్దని చెప్పేసిందట. ఆరోగ్యానికి హాని కలిగించే అలాంటి ప్రకటనలు తాను చేయనంటూ నో చెప్పేసిందట.

ఇటీవల కొన్ని ప్రముఖ లిక్కర్ బ్రాండ్‌లు లావణ్యని సంప్రదిస్తే నో చెప్పేశారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా లావణ్య ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్ కిషన్‌తో కలిసి నటిస్తోంది. ఇందులో ఆమె హాకీ ప్లేయర్. ఈ చిత్రం కోసం లావణ్య హాకీ నేర్చుకున్నారు. మరో చిత్రం చావు కబురు చల్లగాలో కార్తికేయ సరసన నటిస్తోంది. తమిళంలో అథర్వకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు.

Next Story

RELATED STORIES