తమన్‌కు 'మెగా' ఛాన్స్

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ మెగా ఛాన్స్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' తెలుగు రీమేక్‌కు సంగీత దర్శకుడిగా ఖరారైయ్యాడు

తమన్‌కు మెగా ఛాన్స్
X

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ మెగా ఛాన్స్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' తెలుగు రీమేక్‌కు సంగీత దర్శకుడిగా ఖరారైయ్యాడు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ప్రతి సంగీత దర్శకుడికి మెగాస్టార్‌తో మూవీ చేయాలనేది ఓ కల. చిరుతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక బాస్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకునే సమయం వచ్చింది. లూసిఫర్ జర్నీ మొదలవుతోంది' అంటూ ట్వీట్ చేశాడు తమన్.. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమా పాటలతో సందడి చేసిన తమన్... ఈ సారి వకీల్ సాబ్ మొదలగు చిత్రాలతో అలరించనున్నారు. అటు చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా తరవాత లూసిఫర్ రీమేక్ పట్టాలేక్కనుంది.


Next Story

RELATED STORIES