Mahaveerudu: మహావీరుడు షోలు కాన్సిల్
శివకార్తికేయన్ మహావీరుడు సినిమా తెలుగు అభిమానులను నిరుత్సాహపరిచింది. కంటెంట్ డిలే వల్ల ఫస్డ్ డే తెలుగు, తమిళ వెర్షన్స్ షో లు తెలుగు రాష్ట్రల్లోనే కాదు అమెరికా లో కూడా క్యాన్సిల్ అయ్యాయి. మ్యాట్నీ షో నుంచి అయినా ఈ సినిమా స్క్రీనింగ్ ఉంటుందా? లేదా? అన్న విషయంలో ఇప్పటివరకు పూర్తిగా వివరాలు అందలేదని సమాచారం. ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి బజ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి.
అయితే అనుకోకుండా మార్నింగ్ షో క్వాన్సిల్ కావడం ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై పడే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీకి ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. విరుమాన్ తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించిన రెండో మూవీ ఇది.
గత కొంతకాలం గా తెలుగు మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన శివకార్తికేయన్ మహావీరుడు ప్రమోషన్స్‌ను కూడా భారీగానే చేశారు. తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో స్పెషల్ వాయిస్ ఓవర్ తెలుగులో రవితేజ చెప్పగా, తమిళ్లో విజయ్ సేతుపతి చెప్పారు. మహావీరుడు సినిమాలో సునీల్, యోగిబాబుతోపాటు మిస్కిన్ కీలక పాత్రలను పోషించారు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com