ఓకే బ్రాండ్‌‌‌కు అంబాసిడర్లుగా మహేష్‌ బాబు, సుదీప్‌.. !

ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఉత్పత్తి చేస్తున్న హెల్త్‌ ఓకే మల్టీ విటమిన్‌, మినరల్‌ ట్యాబ్లెట్లకు మహేష్‌ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది.

ఓకే బ్రాండ్‌‌‌కు అంబాసిడర్లుగా మహేష్‌ బాబు, సుదీప్‌.. !
X

ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఉత్పత్తి చేస్తున్న హెల్త్‌ ఓకే మల్టీ విటమిన్‌, మినరల్‌ ట్యాబ్లెట్లకు మహేష్‌ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. దక్షిణాదిన హెల్త్‌ ఓకే ట్యాబ్లెట్లకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మహేష్‌, సుదీప్ వ్యవహరిస్తారని, వినియోగదారులకు మరింత చేరువ అవుతామని మ్యాన్‌కైండ్‌ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లకు ప్రాధాన్యత ఉందని వెల్లడించింది. త్వరలో హెల్త్‌ ఓకే ట్యాబ్లెట్ల ఉపయోగాలపై మహేష్‌, సుదీప్‌ ప్రకటనలు రీజనల్‌ ఛానళ్లలో విడుదల చేస్తామని తెలిపింది. హెల్త్‌ ఓకేతో అనుసంధానం కావడంపై మహేష్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో ఎంతో పేరున్న కంపెనీతో జర్నీ ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుత జీవన విధానంలో మల్టీ విటమిన్‌ ముఖ్యమైన ప్రాడక్ట్‌ అని సుదీప్‌ తెలిపారు. మహేష్‌, సుదీప్‌ ఎంపిక సరైన నిర్ణయమని హెల్త్‌ ఓకే ఇండియా సేల్స్‌ మేనేజర్‌ జోయ్‌ ఛటర్జీ అన్నారు.‌ ప్రజాదరణ కలిగిన నటులతో సేల్స్‌ విస్తృతం అవుతాయని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES