Mahesh Babu : త్రివిక్రమ్ సినిమాకి మహేష్ భారీ రెమ్యునరేషన్.. ఎంతంటే..!

Mahesh Babu : త్రివిక్రమ్ సినిమాకి మహేష్ భారీ రెమ్యునరేషన్.. ఎంతంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ హైప్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ హైప్ ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్నారు. గతంలో మహేష్, త్రివిక్రమ్ కలయికలో 'అతడు, ఖలేజా' లాంటి సినిమాలు రావడం జరిగింది.

త్రివిక్రమ్ సైతం 'అరవింద సమేత, అల వైకుంఠపురములో' లాంటి వరుస హిట్ల మీద ఉండటం, మహేష్ కూడ 'మహర్షి, సరిలేరు నీకెవ్వరు'లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడంతో బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది.ఇక ఈ చిత్రానికి గాను మహేష్ బాబు భారీగానే పారితోషకం అందుకుంటున్నారట. ఇండస్ట్రీ వర్గాల టాక్ మేరకు మహేష్ రెమ్యునరేషన్ సుమారు రూ. 55 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

గతంలో మహేష్ అటు ఇటుగా 50 కోట్లను టచ్ అయ్యేది. ఈసారి మాత్రం హాఫ్ సెంచరీ మార్కును దాటేసింది. ప్రజెంట్ మహేష్ బాబుకు ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తవగానే ఈ సినిమాను మొదలుపెడతారు. ఇకపోతే ఈ చిత్రానికి 'పార్ధు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని, ఇందులో మహేష్ అండర్ కవర్ కాప్ పాత్రలో కనిపిస్తారని వార్తలు వినబడుతున్నా అవి ఎంతమాత్రం నిజం అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read MoreRead Less
Next Story