Love Story : 'లవ్ స్టోరీ' ని మిస్ చేసుకున్న మెగా హీరో.. అంతకుముందు.. ?

Love Story : లవ్ స్టోరీ ని మిస్ చేసుకున్న మెగా హీరో.. అంతకుముందు.. ?
Love Story : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Love Story : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయనే చెప్పాలి. సున్నిత‌మైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో శేఖర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. మెుదటిరోజే ఊహకందని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టంది ఈ చిత్రం. ఇదిలావుండగా ఎప్పుడు కొత్తవాళ్ళతో సినిమాలు చేసి హిట్ కొట్టే శేఖర్ కమ్ముల ఈ లవ్ స్టోరీ సినిమాని కూడా అలాగే ప్లాన్ చేశారట.. సినిమాలో కొంత భాగాన్ని కూడా కొత్తవాళ్ళతోనే తెరకెక్కించారట కూడా.. అయితే సినిమా అనుకున్న విధంగా రాకపోవడంతో దానిని అక్కడే ఆపేసి.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ సినిమాని చేయాలనీ అనుకున్నాడట.. ఇదే కథని వైష్ణవ్ వెళ్లి చెప్పగా.. అప్పుడే తీస్తున్న ఉప్పెన సినిమా కథ కూడా అలాగే ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పాడట వైష్ణవ్...కాగా దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

Tags

Read MoreRead Less
Next Story