సావిత్రి కపుల్స్ తో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?

అందం, అభినయంతో మెప్పించి ప్రేక్షకుల గుండెల్లో మహానటిగా గుర్తుండిపోయిన నటి సావిత్రి.. సినిమాల పైన ఉన్న ఆసక్తితో నాటకరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

సావిత్రి కపుల్స్ తో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

అందం, అభినయంతో మెప్పించి ప్రేక్షకుల గుండెల్లో మహానటిగా గుర్తుండిపోయిన నటి సావిత్రి.. సినిమాల పైన ఉన్న ఆసక్తితో నాటకరంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. చిన్న పాత్రలతో మొదలైన ఆమె సినీ ప్రస్థానం స్టార్ హీరోయిన్ వరకు ఎదిగింది. . తమిళ నటుడు జెమిని గణేశన్ ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో సావిత్రి మరణించింది. ఆమె జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమా కూడా తెరకెక్కింది.

అయితే సావిత్రి లాంటి లెజెండరీ యాక్టర్‌‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు నటీనటులు. అలా టాలీవుడ్‌‌లో అయితే మరి చాలా తక్కువనే చెప్పాలి. అంతేకాకుండా ఆమెతో పాటుగా ఆమె భర్త జెమిని గణేశన్‌‌తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది కేవలం ఒక్క స్టార్‌‌కి మాత్రమే.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి మొదటి సినిమాగా తెరకెక్కిన పునాదిరాళ్ళు చిత్రంలో సావిత్రి నటించింది. ఆమెతో కలిసి చిరంజీవి కొన్ని సన్నివేశాల్లో నటించారు. ఆ సమయంలో తన నేపధ్యం గురించి సావిత్రి అడిగి తెలుసుకున్నారని, మంచి నటుడుగా ఎదగాలని దీవించారని చెప్పుకొచ్చారు.

ఇక ఆమె భర్త జెమిని గణేషన్‌‌తో రుద్రవీణ చిత్రంలో కలిసి నటించారు చిరంజీవి. తమిళ చిత్రం ఉన్నాల్ ముడియుం తంబి రీమేక్‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. రెండు చిత్రాలలోను హీరో తండ్రి పాత్రని జెమిని గణేషన్ పోషించారు. ఇలాంటి రేర్ ఫీట్ చిరంజీవి ఖాతాలో ఉండడం అదృష్టమనే చెప్పాలి.

Next Story

RELATED STORIES