అతడి పరువు తీయాలనుకోవడం లేదు... కానీ విడాకులు ఇస్తున్నాను...!

ప్రముఖ మలయాళ జంట ముఖేశ్‌, మెతిల్‌‌‌దేవిక తమ ఎనమిదేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్నీ మెతిల్‌‌‌దేవిక మీడియాకి వెల్లడించింది.

అతడి పరువు తీయాలనుకోవడం లేదు... కానీ విడాకులు ఇస్తున్నాను...!
X

ప్రముఖ మలయాళ జంట ముఖేశ్‌, మెతిల్‌‌‌దేవిక తమ ఎనమిదేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారు. ఈ విషయాన్నీ మెతిల్‌‌‌దేవిక మీడియాకి వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. " నేను విడాకుల పిటిషన్ దాఖలు చేశాను. ఈ విషయంపై ముఖేష్ తన వైఖరిని వెల్లడించలేదు. విడాకుల వెనుక కారణం వ్యక్తిగతమైనది. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత నేను కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి. నేను అతడి పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం నాకు లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. రాజకీయ ఆరోపణలపై స్పందించడానికి నాకు ఆసక్తి లేదు" అని ఆమె తెలిపారు.

అయితే విడాకుల పైన తనకి ఎలాంటి నోటిసులు అందలేదని ముఖేశ్‌ పేర్కొన్నాడు. కాగా సినీ నటుడు,రాజకీయ నాయకుడైన ముఖేష్.. 1982 లో విడుదలైన బెలూన్ చిత్రంతో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. గతంలో ముఖేష్ నటి సరితను వివాహం చేసుకున్నారు. అయితే ముఖేశ్‌ తాగుబోతని, పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2011లో సరిత అతనికి విడాకులు ఇచ్చింది. అనంతరం 2013లో డ్యాన్సర్‌ దేవికను ముఖేశ్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా అంతకుముందు దేవిక రాజీవ్ నాయర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాజీవ్ నాయర్ నుంచి విడాకులు తీసుకుంది దేవిక.

Next Story

RELATED STORIES