ఆ చిత్రంలోని పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా..: వర్ష బొల్లమ్మ

ఆ చిత్రంలోని పాత్ర నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా..: వర్ష బొల్లమ్మ
తెరపై భావోద్వేగాలు ఎంత బాగా పండించినా.. నా పాత్రకు నేను డబ్బింగ్

'చూసీ చూడంగానే' అచ్చమైన తెలుగమ్మాయిలా అనిపిస్తుంది మిడిల్ క్లాస్ మెలోడీస్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఆనంద్ దేవర కొండ చిత్రంలో సంధ్య పాత్రలో కనిపించిన వర్ష 'చూసీ చూడంగానే' చిత్రంతో కథా నాయికగా పరిచయమైంది. 'విజిల్' చిత్రంలోనూ మెరిసిన ఈమె కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈనెల 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఈ చిత్రంలో ఆమెది మధ్యతరగతి జీవితం.. చిత్రంలోని పాత్రకు, తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని చెబుతోంది. సంధ్య తన మనసులోని భావాలన్నీ లోపలే దాచుకుంటుంది. కొన్ని సార్లు నేనూ అంతే.. కానీ సినిమాలో సంధ్య తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్.. నిజ జీవితంలో మా అమ్మానాన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని అంటోంది. గుంటూరు చెందిన అమ్మాయి పాత్ర కావడంతో అక్కడి యాస నేర్చుకున్నా. నా మొదటి చిత్రం 'చూసి చూడంగానే' చిత్రానికి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. నాకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం అంత ఇష్టం ఉండదు. తెరపై భావోద్వేగాలు ఎంత బాగా పండించినా.. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకుంటేనే సంతృప్తి. కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు సులభంగా వచ్చేస్తుందనుకున్నా.. కానీ అంత ఈజీ కాదు.. అయినా నేర్చుకుంటున్నా అని వర్ష అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story