సమంత మనసు దోచిన దుష్యంతుడు ఇతగాడే..!

రుద్రమదేవి సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్ స్వీయనిర్మాణంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం "శాకుంతలం".. అక్కినేని సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది.

సమంత మనసు దోచిన దుష్యంతుడు ఇతగాడే..!
X

రుద్రమదేవి సినిమా తర్వాత దర్శకుడు గుణశేఖర్ స్వీయనిర్మాణంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం "శాకుంతలం".. అక్కినేని సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతోంది. దీనికి గాను భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు.

శకుంతల మనసును దోచుకునే దుష్యంతుడి ఎవరనే సస్పెన్స్ ను రీవిల్ చేశారు. ఈ పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కేరళలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దేవ్ మోహన్. అయితే తెలుగులో ఇంతమంది హీరోలుండగా మలయాళ నటుడిని గుణశేఖర్ ఎంచుకోవడం పట్ల అభిమానాలు కాస్తంత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇక ఈ శకుంతల,దుష్యంతుడి ప్రేమకథను గుణశేఖర్ వెండితెర పైన ఎలా మలచబోతున్నాడన్నది చూడాలి మరి.. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Next Story

RELATED STORIES