డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ముమైత్‌ ఫిర్యాదు

గోవా ట్రిప్‌ పేరుతో తనను డ్రైవర్‌ వేధించాంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ముమైత్‌ ఫిర్యాదు
X

క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది నటి ముమైత్‌ ఖాన్‌. గోవా ట్రిప్‌ పేరుతో తనను డ్రైవర్‌ వేధించాంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ముమైత్‌ ఖాన్‌ చేతిలో తాను మోసపోయాను అంటూ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నిన్న మీడియా ముందుకు వచ్చాడు. తన క్యాబ్‌లో గోవా టూర్‌ వెళ్లొచ్చిన ఆమె 15 వేల రూపాయల బాకీ పడిందని రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌ ఆరోపించాడు. గతంలో ఓసారి డ్రగ్స్ కేసు ద్వారా వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు మరోసారి వివాదం కారణంగా వార్తల్లోకెక్కారు.

ముమైత్ ఖాన్‌ గోవా ట్రిప్‌ కోసం మూడు రోజులు తన క్యాబ్‌ బుక్‌ చేసుకుందని.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని.. ఈ టూర్ సందర్భంగా టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామొడేషన్‌కు ముమైత్ కాన్ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని రాజు ఆరోపించాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను బయటకు వచ్చానన్నాడు.

ముమైత్‌ ఖాన్‌ మాత్రం డ్రైవర్‌ రాజే తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు ఎక్కిన దగ్గర నుంచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. కావాలని టచ్‌ చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ర్యాష్‌ డ్రైవింగ్‌తో మధ్యలో హడలెత్తేలా చేశాడని.. వెంటనే డ్రైవర్‌ పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Next Story

RELATED STORIES