Nagarjuna Remuneration: తగ్గేదే లేదు.. బిగ్‌‌బాస్ 5కి నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్‌..!

Nagarjuna Remuneration: తగ్గేదే లేదు.. బిగ్‌‌బాస్ 5కి నాగార్జున  షాకింగ్ రెమ్యునరేషన్‌..!
Nagarjuna Remuneration : బిగ్‌‌‌బాస్ లాంటి రియాలిటీ షోకి హోస్ట్ అంటే అశామాశి విషయం కాదు. షోలో అతనిదే కీలక పాత్ర...

Nagarjuna Remuneration : బిగ్‌‌‌బాస్ లాంటి రియాలిటీ షోకి హోస్ట్ అంటే ఆషామాషి విషయం కాదు. షోలో అతడిదే కీలక పాత్ర... కంటెస్టెంట్లను ఎంకరేజ్‌ చేస్తూనే అవసరమైన చోట వారికి చురకలు అంటిస్తూ షోను ముందుకు నడిపించాలి. అంతేకాకుండా.. ప్రేక్షకుల నాడి తెలిసుండాలి. అందుకే కంటెస్టెంట్ల కంటే ముందుగా హోస్ట్ ఎవరని చూస్తారు. తెలుగులో బిగ్‌‌‌బాస్ మూడు, నాలుగు సీజన్స్‌‌కి హోస్ట్‌‌గా చేసిన నాగే.. ఐదో సీజన్‌‌ని కూడా హోస్ట్ చేస్తున్నాడు.

అయితే ఈ సీజన్‌‌‌‌కి నాగ్ తీసుకునే రెమ్యునరేషన్‌ పై హైప్ నెలకొంది. 106 రోజులపాటు కొనసాగనున్న ఈ సీజన్‌కు రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌.. ఈ సీజన్‌కి ఇంత డిమాండ్ చేయడం ఆశ్చరాన్ని కలిగిస్తుంది. ఆల్రెడీ రెండు సీజన్ లకి హోస్ట్ గా సక్సెస్ అయిన నాగ్ అడిగినంత ఇవ్వడానికి కూడా షో నిర్వాహకులు కూడా వెనకాడలేదని టాక్.. ఏది ఏమైనా నాగ్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story