బేబీ కేర్ సెంటర్‌గా మారిన బిగ్ బాస్ హౌస్

ఇదేం టాస్క్ బాబోయ్ అంటూ మొర పెట్టుకున్నాడు.

బేబీ కేర్ సెంటర్‌గా మారిన బిగ్ బాస్ హౌస్
X

డైపర్లు, పాలడబ్బాలు, పలకా, బలపం బిగ్‌బాస్ హౌస్ బేబీ కేర్ సెంటర్‌గా మారడంతో రచ్చ రచ్చ చేశారు హౌస్‌లోని సభ్యులు.. ఈ టాస్క్ నుంచి తప్పించుకుంది ఈ గేమ్‌కి సంచాలకురాలిగా మారిన లాస్య. అన్నీ వేషాలు చూడగలిగినా డైపర్ వేసుకున్నా అమ్మారాజశేఖర్‌ని, అవినాష్‌‌ని చూడ్డం ప్రేక్షకులకు పరీక్షే.. పిల్లలుగా మారిన అరియానా, అవినాష్, హారిక అల్లరి అంతా ఇంతా కాదు.. అరియానా సోహెల్‌ని ఒక ఆట ఆడుకుంది.. ముందే నా పని అయిపోయిందని భయపడినంతా అయింది సోహెల్ పని.. ఇక అభిజిత్ అయితే బిగ్‌బాస్.. పిల్లలు చుక్కలు చూపిస్తున్నారు.. ఇదేం టాస్క్ బాబోయ్ అంటూ మొర పెట్టుకున్నాడు. అభిజిత్ తనని దూరం పెడుతున్నాడని భావించిన మోనాల్ నీతో మాట్లాడాలి అని పిలిచేసరికి గేమ్ అయిన తరువాత మాట్లాడతా అంటూ ఆ డిస్కషన్‌ని ముగించాడు.. వినోదాన్ని పంచిన బేబీ కేర్ సెంటర్ ఇంకెన్ని విచిత్రాలు చూపించనుందో నేటి ఎపిసోడ్.

Next Story

RELATED STORIES