నిజంగా జాతిరత్నమే.. యువకుడికి ఉద్యోగం ఇప్పించాడు..!

లాక్‌‌డౌన్ లాంటి సమయంలో అభిమానులకి అండగా ఉంటూ వస్తున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. తనకు తోచిన సాయం అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు

నిజంగా జాతిరత్నమే.. యువకుడికి ఉద్యోగం ఇప్పించాడు..!
X

లాక్‌‌డౌన్ లాంటి సమయంలో అభిమానులకి అండగా ఉంటూ వస్తున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. తనకు తోచిన సాయం అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ జాతిరత్నం. తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్‌ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పించాడు ఈ హీరో. లాక్‌‌డౌన్ టైమ్‌‌లో జాబ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమీర్ అనే వ్యక్తి గురించి తెలియగానే.. ఆ యువకుడి వివరాలను ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఉద్యోగం ఉంటే చెప్పండని ట్వీట్ చేశాడు. అయితే నవీన్ చేసిన ఈ ట్వీట్ కి ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ నుంచి స్పందన వచ్చింది. ఈ కంపెనీలో స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు నవీన్. అంతేకాకుండా సమీర్‌కు వచ్చిన ఆఫర్‌ లెటర్‌ని సైతం అందులో పోస్ట్‌ చేశాడు. త్వరలో ఈ స్టోర్‌కు తాను వెళ్తానని, అలాగే పాండమిక్ టైమ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ నవీన్ ట్వీట్ చేశాడు. నవీన్ చేసిన ఈ పనికి నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్న నువ్వు నిజంగా జాతిరత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

RELATED STORIES