టూ మచ్ బిగ్‌బాస్.. మోనాల్‌ కోసం కుమార్ సాయిని..: ఫైరవుతున్న ఓటర్లు

మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని అంటున్నారు.

టూ మచ్ బిగ్‌బాస్.. మోనాల్‌ కోసం కుమార్ సాయిని..: ఫైరవుతున్న ఓటర్లు
X

హౌస్‌లోకి వచ్చిన దగ్గరనుంచి ఆట మీద ఫోకస్ లేకుండా ముందు అభి పక్కన ఆ తరువాత అఖిల్ పక్కన చేరి ముచ్చట్లు పెడుతోంది మోనాల్.. మరికొంత ముందు కెళ్లి అఖిల్‌కి హగ్గులు, ఆటలో జాగ్రత్త అంటూ ప్రే.. మని కనబరచడం, అఖిల్ వాళ్ల నాన్నకి కూడా కోపం తెప్పించేలా ప్రవర్తిస్తున్న వారిద్దరిని ప్రేక్షకులు కూడా చూడలేకపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి వచ్చారా రొమాన్స్ చేయడానికి వచ్చారా అని బుల్లితెర ప్రేక్షకులు ఆడిపోసుకుంటున్నారు. మోనాల్ డ్రెస్సింగ్స్ సెన్స్ పట్ల కూడా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి ఉద్వాసన పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆట మీద ఫోకస్ చేస్తూ తన పనేదో తాను చేసుకుంటున్న కుమార్ సాయి ఎలిమినేట్ కావడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని అంటున్నారు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఓటింగ్ ప్రకారం జరగట్లేదు.. రేటింగ్ ప్రకారమే జరుగుతోంది అని అనడానికి ఆదివారం నాటి ఎపిసోడ్ తేటతెల్లం చేస్తోందని అంటున్నారు.

దేవి నాగవల్లి, స్వాతీ దీక్షిత్‌ల విషయంలోనే ఆ సంగతి అర్థమైపోయినా మిన్నకుండిన ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం ఇక బిగ్‌బాస్ చూడ్డం ఎందుకు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దేవి ఫెయిర్‌గా ఆడినా బయటకు పంపించేశారు.. స్వాతీ దీక్షిత్‌ని అసలు ఆడకుండానే పంపించేశారు.. అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.. ఇంతకు ముందు సీజన్స్‌లోనూ ఎలిమినేషన్ ప్రక్రియ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా సమర్ధించే వాళ్లు కూడా సరిసమానంగా ఉండడంతో అంత ఫోకస్ అవలేదు. కానీ ఈసారి సీజన్ 4 అందుకు భిన్నంగా సాగుతోంది.

Next Story

RELATED STORIES