NIHARIKA: ఔను... వాళ్లిదరూ విడిపోయారు

NIHARIKA: ఔను... వాళ్లిదరూ విడిపోయారు
విడాకులు తీసుకున్న నిహారిక-చైతన్య... రెండేళ్ల వివాహ బంధానికి ముగింపు... నెల రోజుల క్రిందటే ఇద్దరికీ విడాకుల మంజూరు...

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల.. భర్త నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఊహాగానాలను నిజం చేస్తూ నిహారిక, చైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. రెండేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరిద్దరికి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు నెలరోజుల కిందటే విడాకులు మంజూరు చేసింది.


మెగా బ్రదర్‌ నాగబాబు ఒకానొక్క కూతురైన నిహారికకు... మాజీ ఐజీ ప్రభాకర రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో రాజస్థాన్‌ ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అనంతరం కొద్దిరోజుల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకుంది. 1955 హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ ఇరువురు పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 5న వీరిద్దరి పరస్పర అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.


సోషల్‌ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఒకనొకరు అన్‌ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న ప్రచారం ప్రారంభమైంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని ప్రచారం సాగింది. తాము కలిసి దిగిన ఫొటోలను ఇరువురు సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం అనుమానాలను మరింత పెంచింది. కొన్ని రోజులుగా ఈ విషయమై నెట్టింట బోలెడన్ని వార్తలు షికారు చేసినా అటు మెగా ఫ్యామిలీ గానీ, ఇటు నిహారిక దంపతుల నుంచి గానీ ఎలాంటి ఖండన రాలేదు. ఇప్పుడు ఆ అనుమానాలను నిజం చేస్తూ వీరిద్దరూ విడిపోయారు.


విడాకుల తర్వాత నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్‌ ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్‌ ఓపెన్‌ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story