మెగా డాటర్ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. టాప్ 5-స్టార్ హోటల్‌‌లో..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వివాహ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

మెగా డాటర్ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. టాప్ 5-స్టార్ హోటల్‌‌లో..
X

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైంది. ఈనెల 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దగ్గరి బంధువులను, సన్నిహిత మిత్రులకు మాత్రమే ఆహ్వాన పత్రిక అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్ళి సింపుల్‌గా చేస్తున్నామంటూ కార్డ్‌ని మాత్రం కాస్ట్‌లీగానే ప్రింట్ చేయించినట్లున్నారు. అందుకే రిచ్‌లుక్‌లో ఆకర్షిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వివాహ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో వివాహం అనంతరం డిసెంబర్ 11 శుక్రవారం హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో రిసెప్షన్ జరుగుతుంది. వివాహ ఆహ్వాన పత్రికతో పాటు కొన్ని రుచికరమైన స్వీట్లు కూడా ప్యాక్ చేసి అతిధులకు అందిస్తున్నారు.

ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్‌ విలాస్ ప్యాలెస్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతుంది. ఒబెరాయ్ ఉదయ్‌ విలాస్ ప్యాలెస్ ఆసియా ఖండంలోని టాప్ 5-స్టార్ హోటల్‌గా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది.

Next Story

RELATED STORIES