సమ్మర్ త్వరగా వస్తే ఎంతబావుండు.. వెయిట్ చేయలేకపోతున్నా: నిహారిక

ప్రస్తుతం నిహా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సమ్మర్ త్వరగా వస్తే ఎంతబావుండు.. వెయిట్ చేయలేకపోతున్నా: నిహారిక
X

కొత్త పెళ్లి కూతురు సరికొత్తగా ముచ్చట్లు చెబుతోంది.. పెళ్లైనా తన అల్లరిని అలాగే కంటిన్యూ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక పెదనాన్న చిత్రం 'ఆచార్య' గురించి ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ చిత్రం మే నెల 13వ తేదీన విడుదల కానున్నట్లు ఆఫీషియల్ ప్రకటన వెలువడింది. దీంతో నిహారిక అప్పటి వరకు వెయిట్ చేయాలా.. సమ్మర్ త్వరగా వస్తే ఎంత బావుండు అంటూ ట్వీట్ చేసింది. ఆచార్య టీజర్ చూసి అద్భుతం అని కామెంట్ చేసింది.

ప్రస్తుతం నిహా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆచార్య చిరంజీవి నటించిన 152వ చిత్రం. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షగా నిలవనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఆచార్యపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story

RELATED STORIES