18 Pages ఫస్ట్ లుక్.. ఆసక్తి రేకెత్తిస్తున్న డిఫరెంట్ పోస్టర్..!

18 Pages : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం '18 పేజస్'. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు.

18 Pages ఫస్ట్ లుక్.. ఆసక్తి రేకెత్తిస్తున్న డిఫరెంట్ పోస్టర్..!
X

18 Pages : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం '18 పేజస్'. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను.. ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో అనుపమ.. నందిని అనే పాత్రలో కనిపించనుంది. ''నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అని ఆ పేపర్‌పై రాసి ఉండటం సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. కాగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES