Spy: కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న నిఖిల్ స్పై

Spy: కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న నిఖిల్ స్పై
మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయనున్న నిఖిల్

కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ హోదా అందుకున్న నిఖిల్ తాజా చిత్రం స్పై తో మరో మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే మంచి టాక్ సంపాదించుకున్న స్పై దేశవ్యాప్తంగా ఈరోజే విడుదలైంది. ఫస్ట్ షో కే మంచి టాక్ రావడంతో థియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి. శుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ చుట్టూ తిరిగే కథతో దర్శకుడు గ్యారీ బీహెచ్ ప్రేక్షకులను కట్టిపాడేశాడని తెలుస్తోంది. దీనికి తోడు నిఖిల్ పర్ఫార్మెన్స్ కూడా తోడవ్వడంతో వీకెండ్ షోలకు గిరాకీ పెరిగింది. ఒక్కసారిగా ప్రీ బుకింగ్ లు పెరగిపోయాయి.





మ్యాటనీలు, మార్నింగ్ షోలకు ప్రీ బుకింగ్ లు అయిపోవడంతో రాత్రివేళలో ఎక్స్ట్రా షోలు వేసేందుకు థియేటర్ యజమానులు సమాయత్తం అవుతున్నారు. చాలా రోజుల తరువాత థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయని సంబరపడుతున్నారు. బక్రీద్ సెలవుతో పాటూ వీకెండ్ కూడా వస్తుండటంతో ఎక్స్ట్రా షోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story