Nithiin : క్రేజీ కాంబో : నితిన్ తో వక్కంతం వంశీ..!

Nithiin : వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Nithiin : క్రేజీ కాంబో : నితిన్ తో వక్కంతం వంశీ..!
X

Nithiin : వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ .. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అంధాధూన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు నితిన్. రైటర్ గా ఫుల్ సక్సెస్ అయి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీకి నితిన్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు నెలలో గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సన్నివేశాలతో పాటు వోల్టేజ్‌ యాక్షన్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. ఇక నితిన్ ఇప్పటికే కృష్ణ చైతన్య దర్శకత్వం లో పవర్ పేట అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES