పెళ్లి డేట్ ఫిక్స్.. ఎవర్నీ పిలవట్లేదు..

కొణిదెల వారమ్మాయి కోడలిగా మరో ఇంటికి వెళుతోంది.. మెగా ఫ్యామిలీలో పెళ్లంటే ఫ్యాన్స్ మాములుగా ఉండరుగా.. ఇండస్ట్రీలో అందరికీ ఇన్విటేషన్ వెళ్లాలి.. కానీ కోవిడ్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది అతిధుల్ని, ఆహ్వానించేవారిని.. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని వీళ్లు.. పిలవకపోతేనే బెటర్ అని వాళ్లూ అనుకోవలసి వస్తోంది.. కుటుంబంలోని వారికి మాత్రమే కళ్యాణ పత్రిక అందుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరం తేజ్ ఇలా వారి కుటుంబసభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాలుపంచుకుంటారు.
వరుణ్ తేజ్‌కు నితిన్‌తో పాటు మరికొందరు సినీ స్నేహితులు ఉండడంతో వారికి ఇన్విటేషన్ వెళ్లొచ్చు. కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా అతిధుల జాబితా తయారు చేయబడుతోంది. ఇక వివాహ తేది డిసెంబర్ 9న ఉదయపూర్‌లోని విలాసవంతమైన ది ఒబెరాయ్ ఉదైలాస్ వద్ద జరుగుతుంది. నిహారిక కుటుంబసభ్యులు వివాహ ఏర్పాట్లలో ఉండగా, ఆమె తన వెడ్డింగ్ షాపింగ్‌లో బిజీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com