NTR Luxury Car ఎన్టీఆర్ కొత్త కారు.. ఎంతో తెలుసా!

NTR Luxury Car ఎన్టీఆర్ కొత్త కారు.. ఎంతో తెలుసా!

ఎన్టీఆర్ కొత్త కార్

NTR Buys New Car : కార్ల పట్ల మక్కువ చూపే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కారు కలెక్షన్లలో మరో ఖరీదైన కారు వచ్చి చేరింది.

NTR Luxury Car: దైన కార్లను సేకరించడం ప్రముఖుల అభిరుచి. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొంటారు. తమకు వాహనాల పట్ల ఉన్న అభిరుచిని అభిమానులతో పంచుకుంటారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ పరిశ్రమలో కార్ల పట్ల మక్కువ చూపే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కారు కలెక్షన్లలో మరో ఖరీదైన కారు వచ్చి చేరింది. రూ .5 కోట్ల విలువైన కారును ఎన్‌టీఆర్ బుక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కారు భారతదేశంలో కాదు ఇటలీలో తయారు చేయబడింది. ఈ కారు ఎన్‌టీఆర్ కోసం ఇటలీ నుంచి ప్రత్యేకంగా భారత్‌కు రానుంది.

లంబోర్ఘిని 'ఉరుస్' కారును ఎన్టీఆర్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ కారు కొద్ది రోజుల్లోనే భారత్‌కు చేరుకుంటుంది. లంబోర్ఘిని ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యామోహం. లంబోర్ఘిని చాలా కాస్లీ, లగ్జరీ కార్ల వరుసలో ముందు చేరుతుంది. ఇదిలా ఉండగా, దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఈ కారును బుక్ చేసిన మొదటి నటుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించనున్నారు. ఈ కారు యొక్క ప్రత్యేకతలకు సంబంధించినంతవరకు, ట్విన్ టర్బో వి 8 ఇంజన్ కలిగిన ఈ కారు 650 సివిని ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే, జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story