జూనియర్ NTR ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త..!

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.

జూనియర్ NTR ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త..!
X

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచాన్ని గడగడలాడించే పవర్ఫుల్ మాఫియా డాన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని, లేదులేదు జవాన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు రకరకాలుగా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ పొలిటిషన్ గా కనిపించనున్నారని మరో న్యూస్ వినిపిస్తుంది. యంగ్ టైగర్ ని బలమైన నాయకుడిగా చూపించేలా ప్రశాంత్ నీల్ ఆయన పాత్రని క్రియేట్ చేశాడని తెలుస్తోంది. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ని పొలిటిషన్ గా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

Next Story

RELATED STORIES