నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని 'పింకీ' ఇప్పుడెలా ఉందో చూడండి..!

నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఇందులో వెంకీ చేసిన కామెడీ మాములుగా ఉంటుందా మరి..

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని పింకీ ఇప్పుడెలా ఉందో చూడండి..!
X

నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఇందులో వెంకీ చేసిన కామెడీ మాములుగా ఉంటుందా మరి.. ఈ సినిమాలో వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో తెగ అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా గుర్తుండాలి మరి. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సుదీప.. ఎంతలా అంటే ఆమె పేరు సుదీప పింకీగా మారెంతలా. సుదీప 28 ఫిబ్రవరి 1987లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సూర్య నారాయణ, సత్యవతి.. ఇద్దరు కూడా క్లాసికల్ డాన్సర్లు కావడంతో సుదీప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. 1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో, మోహన్ బాబు హీరోగా వచ్చిన M. ధర్మరాజు MA సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది కానీ ఆమెకి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. 2001 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని పింకీ పాత్ర ఆమెకి ఫుల్ క్రేజ్‌‌ని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది సుదీప. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలో నటించడం బోర్ కొట్టిన సుదీప.. తరువాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌‌గా అవకాశాలు కోసం ఆమె ప్రయత్నించారు కానీ ఎందుకో అవి సఫలం కాలేదు. ఎంబీఏ పూర్తి చేసిన సుదీప.. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నడిపిస్తున్నట్టుగా సమాచారం.Next Story

RELATED STORIES