PSPK 27.. క్రిష్,పవన్ మూవీ టైటిల్ ఫిక్స్!

పవర్‌స్టార్ అభిమానుల్లో జోష్ నింపేలా క్రిష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

PSPK 27.. క్రిష్,పవన్ మూవీ టైటిల్ ఫిక్స్!
X

పొలిటికల్‌గా బిజీగా ఉంటూ.. 'వకీల్ సాబ్' మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ .. వరుస సినిమాకు కమిటయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది. తాజాగా క్రిష్‌తో సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టారు పవన్. పవర్‌స్టార్ అభిమానుల్లో జోష్ నింపేలా క్రిష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మొగల్ సామ్రాజ్య కాలం నాటి పాత్రలను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీకి విరూపాక్ష, గజదొంగ, హరిహర వీరమల్లు, హరహర మహాదేవ్, ఓం శివమ్, బందిపోటు వంటి పేర్లు పరిశీలించారట. అయితే ఫైనల్‌గా 'వీరమల్లు' టైటిల్‌ను ఓకే చేసినట్లు టాలీవుడ్ టాక్. వజ్రాల దొంగ పాత్రకు 'వీరమల్లు' టైటిల్‌ అయితే బాగుంటందని మూవీ యూనిట్ ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుగు చిత్ర పరిశ్రమల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES