పవన్ లుక్ లీక్.. ఖుషిలో ఫ్యాన్స్..!
పవన్‌కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ , మాటలు అందిస్తున్నారు.

X
Vamshi Krishna5 March 2021 8:50 AM GMT
పవన్‌కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ , మాటలు అందిస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ ఫొటో ఒకటికి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్... గొడపై నుంచి దూకుతున్నట్లు కనిపించగా.. వెనుక ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. పవన్ లుక్ బయటకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. !
Next Story